బర్డ్‌ వాక్‌ ఫెస్టివల్‌

Update: 2019-12-16 02:34 GMT

తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో మొదటిసారిగా కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ ఫారెస్ట్‌ డివిజన్‌లో రెండ్రోజులపాటు నిర్వహించిన బర్డ్‌ వాక్‌ ఫెస్టివల్‌కు విశేష స్పందన లభించింది. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి 150 మందికి పైగా పక్షి ప్రేమికులు, ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్స్‌, ఫొటో గ్రాడ్యుయేట్స్‌ తరలిరాగా అటవీప్రాంతం కళకళలాడింది. పెంచికల్‌పేట్‌లోని పాలారపు గుట్ట, రాబందుల గుట్ట సమీపంలో విద్యార్థులు, పక్షి ప్రేమికులు కలియ తిరుగుతూ పక్షుల ఫొటోలను కెమెరాల్లో బంధించారు.

బెజ్జూర్, పెంచికల్ రేంజ్‌లకు వచ్చిన పక్షి ప్రేమికులు ఉదయం ఆరు గంటలకే ఆయా అటవీ ప్రాంతాలకు తరలివచ్చారు. గతంలో ఈ ప్రాంతంలో 270 పక్షి జాతుల్ని గుర్తించగా ఈ సారి మరికొన్నిజాతుల్ని గుర్తించారు. సందర్శకులకు అధికారులు అన్ని సదుపాయాలు కల్పించారు.

Similar News