భారత్ అమెరికాల మధ్య రక్షణ రంగంలో వ్యాపార అవకాశాలపై టీ హబ్‌లో డిఫెన్స్ స్టార్టప్ వర్క్ షాప్ నిర్వహించారు. హైదరాబాద్ టీ హబ్‌లో యూఎస్ కాన్సులేట్ , నెక్సస్ స్టార్టప్ హబ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ వర్క్ షాప్‌లో యువ ఎంటర్‌ప్రైనర్స్ తమ స్టార్టప్ ల పనితీరును వివరించారు. డిఫెన్స్ ఉత్పత్తుల తయారీకి సంబంధించిన స్టార్టప్ సంస్థలు తమ వినూత్న అవిష్కరణలను ప్రదర్శించాయి. రక్షణ రంగంలో ఇరు దేశాలమధ్య వ్యాపార సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు ఈ వర్క్ షాప్ దోహదపడనుంది. డిసెంబర్ 18 ,19 వతేదీల్లో హోటల్ తాజ్ కృష్ణాలో ఇండియా అమెరికాల దేశాల మధ్య రక్షణ సంబంధాలపై సదస్సును నిర్వహించనున్నారు.