జామియా హింసపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసుల లాఠీఛార్జ్‌పై విచారించిన సుప్రీం కోర్టు.. అత్యవసర విచారణకు నిరాకరించింది. మొదట జామియాలో శాంతి నెలకొల్పాలని అధికారులను ఆదేశించింది. ఇలాగే హింస కొనసాగితే విచారణ జరపలేమని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. ఎవరైనా నిరసనల పేరుతో ప్రజాధనానికి నష్టం చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. జామియా, ఏఎంయూ ఘటనలపై పూర్తి స్థాయిలో మంగళవారం విచారణ జరుపుతమని సుప్రీం స్పష్టం చేసింది.