కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో.. ఓ ఎంపీడీవో అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్నాడు. జిల్లాలోని సిర్పూర్ టీ మండల ఎంపీడీవోగా విధులు నిర్వర్తిస్తున్న జగదీష్ అనీల్‌కుమార్‌కు.. గుంటూరుకు చెందిన మేరీ కుమారితో 2018లో వివాహం అయింది. పెళ్లైన నాటి నుంచి కట్నం కోసం వేధిస్తున్నాడు జగదీష్ అనిల్‌కుమార్. రెండ్రోజుల క్రితం తాగిన మైకంలో ఇంటికి వచ్చిన జగదీష్.... అదనపు కట్నం తీసుకురావాలని గొడవ పడ్డాడు. ఇంట్లో ఉన్న కత్తితో తనపై దాడి చేశాడని భార్య తెలిపింది. తన భర్త దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగం పొందాడని బాధితురాలు ఆరోపించింది. తన భర్తపై చట్టరిత్యా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది భార్య.