బంగారంలాంటి భార్య వచ్చిందని మురిసిపోయాడు. బంగారంతో సహా ఉడాయిస్తుందని ఒక్కరోజు కూడా అనుకోలేదు. అత్తగారింట అడుగు పెట్టిన కొత్త కోడలిని చూసి ఇరుగు పొరుగు కూడా ఈర్ష్య పడ్డారు. పైసా కట్నం తీసుకోకుండా కోడల్ని తెచ్చుకున్నావు.. ఎంత మంచి దానవో అంటే అత్తగారెంతో మురిసి పోయింది. కానీ వచ్చిన వారం రోజులకే భర్తతో సహా అత్తా మామలకు అన్నంలో మత్తు మందు కలిపి పెట్టింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బడౌన్ జిల్లా చోటాపారా ప్రాంతానికి చెందిన ప్రవీణ్ ఆజంఘడ్ పట్టణానికి చెందిన రియా అనే యువతిని ఈనెల 9వ తేదీన వివాహం చేసుకున్నాడు. అత్తింటికి వచ్చిన కొత్త కోడలు వారం రోజులు బాగానే ఉంది. అందరినీ మంచి చేసుకుంది.
ఓ రోజు రాత్రి ఇంట్లోని వారందరికీ కమ్మగా వంట చేసి పెట్టింది. అందులో కాస్త మత్తు మందు కూడా కలిపింది. అంతే అది తిన్న వారంతా మత్తులోకి జారుకున్నారు. ఈలోపు శుభ్రంగా ఇల్లంతా సర్దేసి నగలు, బంగారం మూట గట్టుకుని పెళ్లిలో మీడియేటర్‌గా వ్యవహరించిన టింకూతో జంప్ అయ్యింది. తెల్లారి లేచి చూసుకున్న భర్తకి కమ్మగా కాఫీ అందించే భార్య కనిపించలేదు.. అటు అత్తగారూ కోడలి కోసం వెతికింది. ఎక్కడా లేదని తెలుసుకున్నారు. బీరువాలో ఉంచిన నగలు, డబ్బు మాయమయ్యాని గుర్తించారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కొత్త కోడలు ఎంత పని చేసిందని అత్తగారు లబోదిబో మంటున్నారు.