ఏరోబిక్ వ్యాయామం కుదరకపోతే.. యోగాను ప్రయత్నించడం మంచిదట..

Update: 2019-12-16 12:01 GMT

ఏవో కారణాల వల్ల మీకు ఏరోబిక్ వ్యాయామం చేయడానికి కుదరకపోతే మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి యోగాను ప్రయత్నించడం మంచిదంట.. భారతీయ సంతతికి చెందిన నేహా గోథే నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఏరోబిక్ వ్యాయామం ద్వారా మెదడు పొందే ప్రయోజనాలను.. యోగా పెంచుతుందని కనుగొన్నారు. యోగాభ్యాసం మరియు మెదడు ఆరోగ్యం మధ్య సంబంధం గురించి 11 అధ్యయనాలపై దృష్టి సారించిన వీరి బృందం ఈ ఫలితాన్ని కనుగొంది. ఐదు అధ్యయనాలు యోగా సాధనలో ఎటువంటి నేపథ్యం లేని వ్యక్తులను 10-24 వారాల వ్యవధిలో వారానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ యోగా చేసే వారిపై ప్రయోగించారు.

యోగాతో మెదడు ఆరోగ్యాన్ని పోల్చారు. ఇతర అధ్యయనాలు క్రమం తప్పకుండా యోగా సాధన చేసేవారికి మరియు చేయనివారికి మధ్య మెదడు వ్యత్యాసాలను గుర్తించారు. ప్రతి అధ్యయనాలలో MRI వంటి మెదడు-ఇమేజింగ్ పద్ధతులను ఉపయోగించారు. యోగా చేసేవారిలో శరీర కదలికలు, ధ్యానం మరియు శ్వాస వ్యాయామాలను కలిగి ఉన్నాయని హఠా యోగా, ఉర్బానా-ఛాంపెయిన్లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం నుండి వచ్చిన బృందం తెలిపింది. ఏరోబిక్ వ్యాయామం చేయడం వలన మెదడు పనితీరు బాగా మెరుగుపడుతుందని.. అయితే యోగాతోను ఈ ప్రయోజనాన్ని పొందవచ్చని నేహా గోథే వెల్లడించారు.

Similar News