ఎక్కడ పడితే అక్కడ ఫోన్ చార్జింగ్.. ఎస్‌బీఐ వార్నింగ్..

Update: 2019-12-16 08:07 GMT

స్మార్ట్ ఫోన్ కొన్నారు కదా.. మరి పవర్ బ్యాంక్ కూడా పట్టుకెళ్లండి.. చార్జింగ్ అయిపోయిందని ఎక్కడ పడితే అక్కడ ఫోన్‌కి చార్జింగ్ పెట్టారనుకోండి.. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న హ్యాకర్లు మీ అకౌంట్‌లో ఉన్న డబ్బుల్ని శుభ్రంగా కాజేస్తారు. కష్టపడ్డ సొమ్ము బ్యాంకులో దాచుకుంటే కష్టపడకుండా సంపాదించే ఐడియాలు హ్యాకర్ల దగ్గర బోలెడు ఉంటాయి. ఏ చిన్న అవకాశం దొరికినా అకౌంట్ ఖాళీ చేస్తున్నారు. చార్జింగ్ పాయింట్లలో మాల్ వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి హ్యాకర్లు దాడులకు పాల్పడుతున్నారని ఎస్‌బీఐ కస్టమర్లకు వార్నింగ్ ఇస్తోంది. డేటాను చోరీ చేసి కీలక సమాచారం మొత్తం దొంగిలిస్తున్నారని వెల్లడించింది.

Similar News