నిర్భయ నిందితుల పిటిషన్ తిరస్కరణ

Update: 2019-12-18 08:46 GMT

నిర్భయ కేసులో దోషులకు సమీక్ష కోరే హక్కు లేదని, క్షమాభిక్షకు కూడా అవకాశం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై దాఖలైన పిటిషన్ కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. క్షమించరాని నేరం చేసిన వాళ్లు.. ఇప్పుడు రివ్యూ కోరడానికి అర్హులు కారని చెప్పింది. నిర్భయ కేసులో నలుగురు దోషులకు గతంలోనే సుప్రీం ఉరి శిక్ష వేసింది. రివ్యూ పిటిషన్లు కూడా ఇప్పుడు కొట్టేసిన నేపథ్యంలో.. త్వరలో శిక్ష అమలు ఖాయంగా కనిపిస్తోంది. ఐతే, అక్షయ్ సింగ్‌ తరపున వాదించిన అడ్వొకేట్ దీనిపై క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు. నిర్భయ తల్లిదండ్రులు సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.

Similar News