ఎక్కడా లేని విధంగా జహంగీర్ పీర్ దర్గాను అభివృద్ధి చేస్తాం : హోంమంత్రి మహమూద్ అలీ
దేశంలో ఎక్కడా లేని విధంగా జహంగీర్ పీర్ దర్గాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని హజరత్ జహంగీర్ పీర్ దర్గాను మహమూద్ అలీతో కలిసి మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దర్గా పరిసర ప్రాంతాలన్నీ కలియతిరిగారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలు, కులాల వారీ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. తెలగాణలో దేవాలయాలు, దర్గాలు, చర్చిలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రులు చెప్పారు.