డొనాల్డ్ ట్రంప్ ను పదవినుంచి తొలగించాలంటూ నిరసన ప్రదర్శన

Update: 2019-12-18 16:35 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై చట్టసభల్లో ప్రవేశ పెట్టిన అభిశంసనకు జనం మద్దతు తెలుపుతున్నారు. ప్రతినిధుల సభలో ఓటింగ్ చేపట్టిన సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను పదవినుంచి తొలగించాలంటూ వందలాదిమంది నిరసన ప్రదర్శన చేపట్టారు. న్యూయార్క్ నగర వీధుల్లో ప్లేకార్డు పట్టుకొని తమ నిరసనను తెలియజేశారు. అధ్యక్షుడిని పదవినుంచి తప్పించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నట్లు ఆందోళన కారులు వెల్లడించారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవిని పోటీ పడుతున్న జో బిడెన్ పై దర్యాప్తు చేపట్టాలని ట్రంప్ ఉక్రెయిన్ అధినేతను కోరడంతో అధ్యక్షుడిపై చట్టసభల్లో అభిశంసన ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

Similar News