ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని అన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపురం, హర్షగూడ గ్రామాల్లో పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విద్యార్థులకు పెట్టే భోజనాన్ని రుచి చూశారు. స్టూడెంట్స్‌కు యూనిఫామ్స్, షూస్ పంపిణీ చేశారు.