తెలంగాణ లోకాయుక్తను నియమించిన ప్రభుత్వం

Update: 2019-12-19 16:12 GMT

తెలంగాణ లోకాయుక్త, ఉప లోకాయుక్తతో పాటు... మానవ హక్కుల కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని కమిటీ ప్రగతి భవన్‌లో సమావేశమై నియామకాలను ఖరారు చేసింది. లోకాయుక్తగా జస్టిస్‌ సి.వి.రాములు, ఉపలోకాయుక్తగా జి. నిరంజన్‌రావు పేర్లను సిఫారసు చేసింది. వాటిని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. ఇక తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌గా బి. చంద్రయ్య, సభ్యులుగా ఎన్‌.ఆనందరావు, మొహమ్మద్‌ ఇర్ఫాన్‌ మొయినుద్దీన్‌లను నియమించింది.

Similar News