వైసీపీ ప్రభుత్వ తప్పుడు విధానాలతో రాష్ట్రం అధోగతి పాలవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. అమరావతి భూముల విలువ పెరగడాన్ని జీర్ణించు కోలేకపోతున్నారని ఆరోపించారు. రాజధాని విషయంలో ప్రజలతో ఆడుకుంటారా? అని మండిపడ్డారు. గతంలో అమరావతిని సమర్థించిన జగన్.. ఇప్పుడు 3 రాజధానులంటూ యూ టర్నర్ తీసుకున్నారని...విమర్శించారు..టీడీపీ హయాంలో కంపెనీలు తీసుకొస్తే.. వైసీపీ వాటిని తరిమేసేందన్నారు.
విశాఖను నాలెడ్జ్ హబ్‌గా తయారు చేయాలని చూశామని చెప్పారు చంద్రబాబు. కానీ అభివృద్ధి జరిగితే ప్రతిచోట అవినీతి ముద్ర వేస్తున్నారని ఆరోపించారు..మీడియా గొంతు నొక్కడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు..2430 జీవో తెచ్చి ఆంక్షలు పెట్టారని ఆరోపించారు... అటు పోలీసుల తీరుపైనా చంద్రబాబు మండిపడ్డారు. ఇష్టానుసారంగా టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారని అన్నారు..రాష్ట్రంలో ఆడపిల్లలకు భద్రత కరువైందన్నారు.