ఏపీ రాజధానిని మూడు ముక్కలు చేయడం భావ్యం కాదని... అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి తప్ప రాజధానుల వికేంద్రీకరణ కాదన్నారు.. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. రైతులు ప్రభుత్వాన్ని నమ్మి 33 వేల ఎకరాలు రాజధానికి స్వచ్ఛందంగా ఇచ్చారని... ఇప్పటికే మౌలిక వసతుల కోసం 9 వేల కోట్లు ఖర్చు చేశామని.. ఈ తరుణంలో సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీస్ విశాఖలో పెట్టాలని కమిటీ సూచించడం దారుణమన్నారు జయదేవ్.