సీఎం ప్రకటన ప్రాంతీయ, కులాల మధ్య విబేధాలు సృష్టిస్తోంది : టీడీపీ నేత బండారు
ఏపీ రాజధాని విషయంలో సీఎం జగన్‌కు క్లారిటీ లేదని.. టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ విమర్శించారు. అమరావతిని జగన్ అప్పుడే ఎందుకు వ్యతిరేకించలేదని.... కమిటీ రిపోర్ట్ రాకుండానే జగన్ ఎలా ప్రకటన చేశారని ప్రశ్నించారు. సీఎం ప్రకటన ప్రాంతీయ, కులాలు, పార్టీల మధ్య విబేధాలు సృష్టిస్తోందన్నారు బండారు.