విశాఖలో రెండు రోడ్లు వేసినంత మాత్రాన రాజధాని అవుతుందా? : పంచుమర్తి అనురాధ
విశాఖలో రెండు రోడ్లు వేసినంత మాత్రాన రాజధాని అవుతుందా అని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. విశాఖను ఆర్థికంగా నాశనం చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. వైఎస్ విజయలక్ష్మి వైజాగ్‌లో పోటీ చేస్తే అత్యంత ప్రమాదకరమని సబ్బం హరి అప్పుడే అన్నారని గుర్తు చేశారు. వైజాగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో వైసీపీ నేతలు డబ్బులు వసూలు చేశారని ఆరోపించిన అనురాధ.. ఇడుపుల పాయ అసైన్డ్ భూముల గురించి వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.