13 ఏళ్లకే ప్రేమా, పెళ్లి, గర్భం.. భర్తను పోగొట్టుకొని..

Update: 2019-12-21 05:41 GMT

తెలిసీ తెలియని వయసు.. మంచి చెడు చెప్పేవారు లేరు. మనసుకి నచ్చినది చేయడమే మంచిదనుకుంది కాబోలు.. చెన్న కేశవులతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. చిన్న వయసులోనే అమ్మానాన్నలను కోల్పోయి బాబాయి, నానమ్మల పంచన చేరారు అక్కా, చెల్లి, తమ్ముడు. అక్షరాలైనా నేర్చుకుందో లేదో.. అతగాడు నచ్చాడు.. అతడినే పెళ్లి చేసుకుంటానని వెళ్లిపోయింది. 13 ఏళ్లకే పెళ్లి చేసుకుని గర్భం దాల్చింది. లారీ డ్రైవర్ పని చేస్తున్న చెన్న కేశవులు దిశ హత్యాచారం కేసులో నిందితుడు. 6 నెలల గర్భంతో ఉన్న ఆ బాలిక భర్తను కోల్పోయి ఒంటరిగా రోదిస్తోంది. నారాయణపేట జిల్లా బాలల సంరక్షణ విభాగం శుక్రవారం గ్రామంలో ప్రాథమిక విచారణ జరిపింది. బాలికకు సంబంధించిన వివరాలను సేకరించారు. బాలిక వయసు 13 సంవత్సరాల ఆరు నెలలు అని అధికారులు గుర్తించారు. దీంతో ఆమెను బాలల సదనంలో చేర్పించి రక్షణ కల్పిస్తామని చెన్నకేశవుల తల్లిదండ్రులతో అధికారులు మాట్లాడారు. కానీ వారు అంగీకరించలేదు. అయితే దీనిపై ప్రాథమిక నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామని జిల్లా బాలల సంరక్షణాధికారి రాములు అంటున్నారు.

Similar News