‘నేతన్న నేస్తం’ ప్రారంభించిన సీఎం జగన్‌

Update: 2019-12-21 09:06 GMT

అనంతపురం జిల్లా ధర్మవరంలో నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం జగన్‌. లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అక్కడే కేక్‌ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. నేతన్నలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని.. ఈ పథకం కింద మగ్గం ఉన్న ప్రతి నేతన్నకు ఏటా 24 వేల ఆర్థిక సాయం అందిస్తామని జగన్‌ చెప్పారు.

అధికారంలోకి వచ్చి ఆరు నెలలు తిరక్క ముందే ఇచ్చిన హామీలన్ని నెరవేర్చామన్నారు సీఎం జగన్‌. వచ్చే నెల నుంచి అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించబోతున్నామన్న ముఖ్యమంత్రి... అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేశామని గుర్తు చేశారు.

Similar News