ప్రపంచంలో భారతీయ సంస్కృతి, ఆరోగ్యంలో చాలా మంచి పద్దతులున్నాయన్నారు తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్. ప్రకృతి వైద్య చికిత్స, యునాని, హోమియోపతి, ఆయుర్వేద వైద్య విధానాలు గొప్పగా చికిత్స అందిస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర వచ్చిన తరువాత వైద్య ఆరోగ్యశాఖను గొప్పగా తీర్చిదిద్దుతున్నామన్నారు ఈటెల.
భారతీయ సంప్రదాయ వైద్యానికి పూర్వ వైభవం తీసుకురావడానికి అనే చర్యలు తీసుకుంటున్నమన్నారు ఆయన. యోగా అధ్యయన పరిషత్, నేచర్ క్యూర్ హాస్పిటల్స్ గురించి కూలంకుషంగా చర్చించి.. కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు మంత్రి ఈటెల. నేచర్ క్యూర్ కాలేజీలో 2021 నుంచి పీజీ కోర్సులు ప్రారంభిస్తామన్నారు.