ఇంత నిర్లక్ష్యం వహిస్తే ఎలా? : మంత్రి హరీష్‌రావు

Update: 2019-12-21 09:13 GMT

కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం పాఠశాలల ఉభ్యున్నతికి కృషి చేస్తుంటే... మీరు ఇంత నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని ఉపాధ్యాయులను ప్రశ్నించారు మంత్రి హరీష్‌రావు. మెదక్‌ జిల్లా తుఫ్రాన్‌ గురుకులంను సందర్శించిన హరీష్‌.. అక్కడ పదో తరగతి విద్యార్థులను దత్తాత్రేయశర్మ పేరును తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌లో రాయాలని సూచించారు. ఎవరూ సరిగా రాయలేకపోయారు. దీంతో హరీష్‌రావు గురుకులం ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయులను మందలించారు. ఉపాధ్యాయులు ఆత్మ విమర్శ చేసుకుని పాఠాలు చెప్పాలన్నారు. మరోవైపు తుఫ్రాన్‌ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు మంత్రి హరీష్‌.

Similar News