శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. ఆలయానికి చేరుకున్న గవర్నర్‌కు.. అధికారులు, ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం గవర్నర్‌కు వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం శ్రీశైలంలోని స్ఫూర్తి కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు బిశ్వభూషణ్ హరిచందన్.