పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనానికి ముఖ్య అతిథిగా RSS చీఫ్‌

Update: 2019-12-22 11:22 GMT

హైదరాబాద్‌లోని బండ్లగూడలో ఉన్న సరస్వతీ విద్యాపీఠంలో ఈ నెల 29 న రాష్ట్ర స్థాయి పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా RSS చీఫ్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ హాజరౌతున్నారని... విద్యాపీఠం పాలక మండలి సభ్యులు అన్నదానం సుబ్రమణ్యం తెలిపారు. మోహన్‌ భగవత్‌ శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రారంభించడంతో పాటు పరమానంద బన్సల్‌ సహకారంతో నిర్మించిన టీచర్స్‌ క్వార్టర్స్‌ను ప్రారంభిస్తారని వెల్లడించారు. 10 వేల మంది పూర్వ విద్యార్థులు, పూర్వ ఆచార్యులతో ఈ మహా సమ్మేళనం నిర్వహిస్తున్నామని సుబ్రమణ్యం తెలిపారు.

Similar News