ఓవైపు రైతుల నిరసనలు, మరోవైపు పోలీసుల ఆంక్షలు.. అమరావతి గ్రామాల్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.. రైతులు మహాధర్నాకు సిద్ధమవడంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.. టెంట్ వేసుకునేందుకు కూడా పర్మిషన్ ఇవ్వకపోవడంతో వారంతా ఎండలోనే ధర్నా కొనసాగించారు.. పోలీసుల తీరుపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.. అయితే, రోడ్డుకు అడ్డంగా టెంట్ వేస్తున్నందునే షామియానా నిర్వాహకులకు టెంట్ ఇవ్వొద్దని నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు..
మొన్నటి ఆందోళనల్లో సచివాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన వారిపై కేసులే మోదు చేసినట్లు తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.. రైతులు శాంతియుతంగా నిరసన తెలిపితే సహకరిస్తామంటున్నారు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామంటున్నారు. రాజధాని గ్రామాల్లో 600 మందికిపైగా పోలీసులు మోహరించారని.. రేపటి నుంచి సచివాలయానికి వచ్చే ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు తుళ్లూరు డీఎస్పీ.