సీఎం జగన్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు బీజేపీ విజయవాడ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ కిలారు దిలీప్. రాజధాని మార్చాలంటే కేంద్రం అనుమతి తప్పని సరన్నారు. రైతులకు మద్దతు తెలిపిన ఆయన.. మంగళవారం బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమరావతిలో పర్యటిస్తారని తెలిపారు. అటు టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణ కూడా రైతులకు సంఘీభావం ప్రకటించారు. రాజధాని తరలింపును అడ్డుకుంటామని అన్నారు.