కాసేపట్లో రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటించనున్నారు. రైతుల ఆందోళనలకు సంఘీభావంగా టీడీపీ నేతలతో కలిసి ఆయన పర్యటన కొనసాగనుంది. అమరావతి కార్యాలయంలో ప్రస్తుతం కృష్ణా, గుంటూరు నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాజధాని అంశం, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. అటు, ఈనెల 27న ఏపీ కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో సెక్యూరిటీ పటిష్టం చేస్తున్నారు. 3 రాజధానుల ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపితే.. కొన్ని చోట్ల ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా అదనపు బలగాల్ని కూడా మోహరిస్తున్నారు.