హైకోర్టు అమరావతిలోనే ఉండాలి: బెజవాడ బార్ అసోసియేషన్

Update: 2019-12-23 10:57 GMT

ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతి అట్టుడుకుతోంది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నినాదాలు మిన్నంటుతున్నాయి. ప్రాణాలైనా ఇస్తాం కానీ.. అమరావతి రాజధాని తరలింపునకు ఒప్పుకునేది లేదంటున్నారు 29 గ్రామాల ప్రజలు రైతులు. హైకోర్టును కర్నూల్‌కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది బెజవాడ బార్‌ అసోసియేషన్‌.. ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిర్ణయం మార్చుకోకుంటే.. ఈ నెల 27 జరిగే కేబినెట్‌ భేటీనీ అడ్డుకుంటామని హెచ్చరిస్తోంది. మరోవైపు మంత్రి వెల్లంపల్లి ఇంటిని రాజధాని పరిరక్షణ సమితి ముట్టడించింది.

Similar News