తెలంగాణాలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బలమైన శక్తిగా ఉందన్నారు RSS తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ రమేష్. దీని కారణంగానే ఇక్కడ ఏడు దశాబ్దాలుగా వివిధ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామన్నారు. అన్ని ప్రాంతాలకు సంఘం చేరుకోవాలనే లక్ష్యంతో ఈ నెల 24,25, 26 తేదీలలో విజయ్ సంకల్ప దివస్ పేరుతో శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. 2024 వరకు ప్రతి బస్తీకి చేరుకునేందుకు లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామన్నారు. సంఘ శాఖలే కాకుండా హైదరాబాద్ నగరంలో వెయ్యికిపైగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు రమేష్ వెల్లడించారు. భారతీ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే మూడు రోజుల శిబిరానికి అన్నిఏర్పాట్లు చేశామని.. 25వ తేదీ సాయంత్రం సరూర్ నగర్ స్టేడియంలో సార్వజనిక సభ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ హాజరుకానున్నట్లు వివరించారు