అమరావతి రైతుల సమస్య కాదు: కన్నా

Update: 2019-12-24 13:27 GMT

అమరావతి అనేది రైతుల సమస్యకాదని, అది రాజధాని సమస్య అన్నారు ఏపి బీజేపీ అధ్యక్షులు కన్నాలక్ష్మినారాయణ. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారిస్తే రాష్ట్రం మీద నమ్మకం పోతుందన్నారు. విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో పౌరసత్వ సవరణ చట్టంపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్, వామపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కన్నా అన్నారు. ఈ చట్టం ఎవరికి వ్యతిరేకం కాదన్నారు. అమరావతి నుంచి రాజధానిని పూర్తిగా మారుస్తే అభివృద్ది కుంటుపడుతుందన్నారు.

Similar News