ఈ నెల 29న హైదరాబాద్ శిల్పకళావేదికలో మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి శతజయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్లు, పలువురు ప్రముఖులు హాజరవుతున్నారని.. మర్రి శిశిధర్ రెడ్డి తెలిపారు. ప్రతిఏటా మర్రి చెన్నారెడ్డి నేషనల్ అవార్డ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పురస్కారాలు ఇస్తున్నామని శశిధర్ రెడ్డి చెప్పారు. అందులో భాగంగా ఈ ఏడాది ప్రముఖ నీటి, పారుదల నిపుణులు టి. హనుమంతరావుకు అవార్డు ఇస్తున్నట్టు పేర్కొన్నారు.