తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

Update: 2019-12-24 08:26 GMT

తెలంగాణలో 2020 కి సంబంధించి ఎంసెట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల అయింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, అధికారులతో కలిసి ఈ షెడ్యూల్ ను విడుదల చేశారు. వచ్చే ఏడాది మే 2న ఈసెట్‌ పరీక్ష, మే 5,6,7 తేదీల్లో ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ఎంసెట్‌ ను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అలాగే మే 9,11 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్ష, మే 13నుంచి పిఈ సెట్‌ను జరుపుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే మే 20,21 తేదీల్లో ఐసెట్‌ , మే 23న ఎడ్ సెట్, మే 25న లాసెట్, పీజీ లా సెట్, మే 27 నుంచి 30 మధ్య పీజీ ఈసెట్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

Similar News