మూడు రాజధానులకు వ్యతిరేకంగా పురుడు పోసుకుంటున్న ఉద్యమం

Update: 2019-12-25 13:01 GMT

సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఒకటే రాజధాని ఉండాలని, అది అమరావతే కావాలంటూ తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యమం ఊపిరి పోసుకుంది. కాకినాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి నాయకులు జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం అభివృద్ధి అజెండాతో పనిచేయాలి కానీ.. వ్యక్తిగత అజెండాలతో ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం దారుణమని జేఏసీ నాయకులు అన్నారు. గురువారం డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు కన్నబాబు, విశ్వరూప్ కార్యాలయాల వరకు ర్యాలీ చేసి.. దశలవారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Similar News