విజయసంకల్ప శిబిరంగా మారుతున్న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం

Update: 2019-12-25 06:55 GMT

RSS తెలంగాణ ప్రాంత విజయసంకల్ప శిబిరం పేరుతో LB నగర్‌ సరూర్‌నగర్‌ ఇండోర్ స్టేడియంలో భారీ సభకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ప్రధాన స్టేజిపై 16 మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. ఈ సభకు సుమారు 25 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సాయంత్రం ప్రారంభం కానున్న ఈ సభ ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ హాజరుకానున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు, కార్యకర్తలు ర్యాలీగా తరలిరానున్నారు.

Similar News