టీడీపీ నేతలు అలా చేశారని వైసీపీ నేతలు నిరూపిస్తే ఉరిశిక్షకైనా సిద్ధం : ధూళిపాళ్ల నరేంద్ర
రాజధానిలో టీడీపీ నేతలు ఇన్‌సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని వైసీపీ నేతలు నిరూపిస్తే ఉరిశిక్షకైనా సిద్ధమన్నారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర. రాజధానిగా అమరావతికి ఆమోదం తెలిపిన ఆనాటి ప్రతిపక్ష నేత జగన్... నేడు మూడు రాజధానులు అంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టం ఎంత వరకు సబబు అని ధూళిపాళ్ల ప్రశ్నించారు. రాజధాని మార్పును నిరసిస్తూ గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అని నినాదాలు చేశారు.