రాజధాని తరలింపును నిరసిస్తూ రైతు ఆత్మహత్యాయత్నం

Update: 2019-12-26 09:44 GMT

రాజధాని తరలింపును నిరసిస్తూ పెనుమాక రైతు దీక్ష శిబిరం దగ్గర రమేష్‌ అనే రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. రైతులందరూ దీక్ష శిబిరం నుంచి వెళ్లిన వెంటనే పెట్రోల్ మీద పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే నీళ్లు పోయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో పెనుమాకలో ఉద్రిక్తత ఏర్పడింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. రైతును అదుపులోకి తీసుకున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని.. లేదంటే ప్రాణత్యాగానికైనా సిద్ధమంటున్నాడు రైతు.

 

Similar News