భక్తుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ

Update: 2019-12-28 01:01 GMT

సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తున్న టీటీడీ.. తాజాగా భక్తుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అలిపిరిలో వసతి సముదాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అలిపిరి వద్ద నిర్మించనున్న వసతి సముదాయాల స్థలాన్ని ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. వసతి సముదాయాలతోపాటు అన్న ప్రసాద సముదాయాలు, ధార్మిక కార్యక్రమాలు, భజనలు, ధ్యానం, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.. పాలక మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Similar News