మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఏఏను అమలు చేసి తీరుతామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకే ఎన్‌ఆర్సీ పేరుతో మజ్లిస్ నిజామాబాద్‌లో సభ ఏర్పాటు చేసిందని విమర్శించారు. ఎన్ఆర్సీ వలన నిజమైన ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. రాష్ట్ర పాలన ఓవైసీ చేతిలోకి వెళ్లిపోయిందని ఆరోపించారు.