బిటెక్ విద్యార్థిని అదృశ్యం కలకలం

Update: 2019-12-29 07:22 GMT

మేడ్చల్‌లో బిటెక్ విద్యార్థిని కావ్య అదృశ్యం కలకలం రేపింది. కండ్లకోయ CMR కళాశాలలో విద్యార్థిని బిటెక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే మూడు రోజులు నుంచి తమ కుమార్తె నుంచి ఎటువంటి సమాచారం లేదని కళాశాల, హాస్టల్ నిర్వాహకులను కావ్య తల్లిదండ్రులు సంప్రదించారు. కానీ వారి నుంచి ఎటువంటి స్పందన లేదంటూ విద్యార్థిని తల్లిదండ్రులు కళాశాల ముందు ఆందోళనకు దిగారు. తమ కూతురును చూపించాలని కన్నీరు మున్నీరుగా విలపించారు.

 

Similar News