ఖమ్మంలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. తన వ్యాపార సహచరుడు, స్థానిక సీఐ దాదాపు 40 మందితో కానిస్టేబుల్ రవీందర్ ఇంటికి వచ్చి గొడవ చేశాడు. దీంతో మనస్తాపం చెందిన రవీందర్.. ఇంట్లో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు రవీందర్‌ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సీఐ, కానిస్టేల్ రవీందర్ ఇద్దరు బంధువులే అయినప్పటికీ.. వ్యాపార లావాదేవీల్లో నష్టాలు రావడంతో ఇద్దరి మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. తమకు రక్షణ కల్పించాలని కానిస్టేబుల్ భార్య వేడుకుంటున్నారు.