ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కూసుమంచి మండలం జీళ్ల చెరువు సమీపంలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో నలుగురు మృతి చెందారు. మరో 7గురికి గాయాలు అయ్యాయి. ప్రమాదం సమయంలో ట్రాక్టర్‌లో 30 మంది కూలీలు ఉన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈప్రమాదంపై మంత్రి అజయ్ కుమార్ ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాద ఘటనపై ఎంపీ నామా నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.