తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్. ఎన్నికల కమిషన్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రిజర్వేషన్లు ఖరారు కాకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని అడిగానని.. సమాధానం చెప్పాల్సిన నాగిరెడ్డి తనను తీవ్ర పదజాలంతో దూషించడమే కాకుండా ఆఫీస్ సిబ్బందితో దాడి చేయించారని కృష్ణ స్వరూప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారి నాగిరెడ్డితో పాటు సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నాంపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.