ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో నాటుబాంబు పేలింది. క్రాస్ రోడ్డు వద్ద జరిగిన పేలుడులో ఓ వ్యక్తి చనిపోయాడు. పేలుడు తీవ్రతకు శరీరభాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఇదే ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని ఆస్పత్రికి తరలించారు.
నాటుబాంబు పేలుడుతో ఉట్నూరు ఉలిక్కి పడింది. ఏజెన్సీ ఏరియాలో నాటు బాంబును ఎవరు తీసుకెళ్తున్నారు.. ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. మరోవైపు స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.