నగర పోలీస్ కమిషనర్‌ అంజనీకుమార్‌పై పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ విమర్శలు

Update: 2019-12-31 07:46 GMT

హైదరాబాద్‌ పోలీసుల తీరుపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేశారు టి.కాంగ్రెస్ నాయకులు. సేవ్‌ ఇండియా-సేవ్ కానిస్ట్యూషన్‌ పేరుతో శాంతి ర్యాలీ తలపెడితే.. అనుమతి ఇవ్వలేదని.. అడ్డుకున్నారని.. ఫిర్యాదు చేశారు. నగర పోలీస్ కమిషనర్‌ అంజనీకుమార్‌పై ఘాటు విమర్శలు చేశారు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గవర్నర్‌కు విభజన చట్టం కల్పించిన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి చర్యలు తీసుకోవాలని తమిళి సైని కోరారు. ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడానికి, అరెస్టులు చేయడానికి కాంగ్రెస్ ఏమైనా నిషిద్ధ సంస్థా అని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

Similar News