పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో ఓ గుర్తుతెలియని యువకుడి సాహసాలు స్థానికుల్ని అబ్బురపరిచాయి. ఎటు నుంచి వచ్చాడో తెలియదుకాని.. సడెన్‌గా గాల్లో పల్టీలు కొడుతూ అందరిదృష్టిని ఆకర్షించాడు. ఇతడి విన్యాసాలు చూడటానికి రోడ్డుపై వెళ్లేవారు గుంపులుగా చేరారు.
గాల్లో పల్టీలు కొట్టే ఫీట్ అయ్యాక.. తన మోచేతితో రాళ్లను పగలగొట్టడం మొదలుపెట్టాడు. ఎవరో తెలియని ఆ యువకుడు అడ్వెంచర్స్ చేస్తుంటే.. అంతా నోరువెళ్లబెట్టి చూశారు.