పాక్‌ చెరలో బంధీలుగా ఉన్న సిక్కోలు మత్స్యకారులకు విముక్తి

Update: 2020-01-05 12:33 GMT

13 నెలలపాటు పాక్‌ చెరలో బంధీలుగా ఉన్న సిక్కోలు మత్స్యకారులకు ఎట్టకేలకు విముక్తి కలిగింది. గుజరాత్‌లోని వీరావలి ప్రాంతానికి వేటకోసం వెళ్లిన మత్స్యకారులు పాక్‌ కోస్టుగార్డులకు చిక్కారు. అప్పటి నుంచి మత్స్యాకరుల కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురయ్యాయి. తమ ఆప్తులను విడిపించాలని.. 13 నెలలుగా... అధికారుల చుట్టూ తిరగగా.. ప్రయత్నాలు ఫలించాయి. రేపు వాఘా సరిహద్దు వల్ల 13 మంది శ్రీకాకుళం మత్స్యకారులను.. .విదేశాంగ శాఖ అధికారులకు.. పాక్ అప్పగించనుంది. పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు చిక్కిన వారిలో డి.మత్స్యలేశం, కొత్త మత్స్యలేశం, శివాజీదిబ్బలపాలెం, బడివానిపేట గ్రామాలకు చెందిన సుమారు 15 వరకు మత్స్యకారులున్నారు. చేపలవేట సమయంలో దట్టమైన పొగమంచు కారణంగా వీరు ఉన్న బోటు పాక్ అంతర్భాగంలోకి వెళ్లడంతో అప్పటి నుంచి పాక్‌లోని జైళ్లలో మగ్గుతున్నారు. ఎట్టకేలకు వీరు విడుదలవుతున్నారు.

Similar News