అమరావతిలో హోరెత్తుతున్న నిరసనలు, మహా ధర్నాలు

Update: 2020-01-05 04:52 GMT

అమరావతి రైతుల ఆందోళలు తారా స్థాయికి చేరాయి. రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ చేస్తున్న నిరసనలు, మహా ధర్నాలు, దీక్షలతో హోరెత్తిస్తున్నారు. 19 రోజులుగా కొనసాగుతున్న ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. తూళ్లూరులో మహా ధర్నాతో పాటు.. వంటా వార్పుతో అమరావతి రైతులు నిరసన తెలుపుతున్నారు.. అటు మూడు రాజధానుల ప్రభుత్వ ప్రతిపాదనపై రగిలిపోతున్న రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలతో జనం రోడ్లపైకి వచ్చి సేవ్‌ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినదిస్తున్నారు. ..

19 రోజులుగా అమరావతి రైతులు రోడ్లపైకి వచ్చి దీక్షలు, ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందిచడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రదేశంలో నిరసనలు తెలుపుతున్నారు. పిల్లల భవిష్యత్‌ కోసం రాజధానికి భూములిస్తే.. ఇప్పుడీ పరిస్థితి తలెత్తిందని మండిపడుతున్నారు. నమ్మి ఓట్లు వేసిన జగన్‌ వలన రోడ్డున పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

మరో వైపు రాజధాని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు అమరావతి పరిరక్షణ సమితి సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. రాజకీయాలను పక్కనబెట్టి అన్ని పార్టీల నేతలు ఉద్యమానికి సహకరించాలని సమితి సభ్యులు కోరారు. ప్రభుత్వం మూడు రాజధానులపై వెనక్కి తగ్గేవరకు తమ ఆందోళనలు విరమించేది లేదని వారు తెగేసి చెబుతున్నారు.

Similar News