AP : వైసీపీని ఓడించాలంటూ త్రివిక్రమ్ పిలుపు

Update: 2024-05-09 09:53 GMT

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు డైరక్టర్ త్రివిక్రమ్. ఏపీ పాలిట ఉగ్రవాదుల్లా మారిన వైసీపీని ఓడించి, కూటమిని గెలిపించాలన్నారు. దీనికి ముందు ఇంట్రస్టింగ్ పరిణామాలు జరిగాయి.

పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్... ఆ అభిమానంతో పవన్ మద్దతుగా ఓ పాట రాశారు. టాలీవుడ్ లో ఎవరైనా వైసీపీకి అనుకూలంగానే పాటలు రాయాలి.. తమకే ప్రచారం చేయాలనే విధంగా వింత పోకడలు పోతున్న వైసీపీ సోషల్ మీడియాలో త్రివిక్రమ్ ను టార్గెట్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో త్రివిక్రమ్ పేరు, పర్సనల్ ఫోన్ నెంబర్ పెట్టడంతో ఆయనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 5వేల కాల్స్ వచ్చినట్లు పేర్కొన్నారు. త్రివిక్రమ్ కు ఫోన్ చేసి, తిట్లు, శాపనార్థాలు పెట్టినట్లు తెలిపారు.

దీంతో.. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓపెన్ అయ్యారు. వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చినట్టు సమాచారం.

Tags:    

Similar News