A P News: కొడాలి నానికి చెక్ పెడుతూ మారుతున్న గుడివాడ

తెలుగుదేశం కంచుకోట గుడివాడ

Update: 2024-05-10 01:45 GMT

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు చాలా సెన్సిటివ్‌గా తయారయ్యాయి. ఇక కృష్ణా జిల్లా గుడివాడ. రాష్టవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అసెంబ్లీ స్థానం. ఒకప్పుడు దివంగత NTR ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం....తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆయన తర్వాతా ఇక్కడ ఆ పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా గెలుస్తూవచ్చారు. అలా 2004, 2009లో కొడాలి నాని గెలిచారు. 2009 తర్వాత వైకాపా గూటికి చేరారు. అప్పటి నుంచి రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశంపైనే...ఇష్టారీతిన తెగబడ్డారు. నోరుపారేసుకున్నారు. ఆఖరికి చంద్రబాబు, లోకేష్‌తో పాటు వారి కుటుంబసభ్యులపైనా అత్యంత తీవ్రంగా వ్యక్తిగత దాడికి దిగారు. ఇలాంటి కొడాలిని ఓడించి ఆయనకు రాజకీయంగా కోలుకోలేని దెబ్బకొట్టాలని... తెలుగుదేశం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ ప్రయత్నంలో తెలుగుదేశం అభ్యర్థి రాము చాలా ముందజంలో ఉన్నారు. ఆయన ఈసారి గుడివాడలో తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమనే ధీమా వినిపిస్తోంది. 

ఒకప్పుడు దివంగత ఎన్టీఆర్​ ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆయన తర్వాతా ఇక్కడ ఆ పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా గెలుస్తూవచ్చారు. అలా 2004, 2009లో కొడాలి నాని గెలిచారు. 2009 తర్వాత వైఎస్సార్సీపీ గూటికి చేరారు. అప్పటి నుంచి రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశంపైనే ఇష్టారీతిన తెగబడ్డారు. నోరుపారేసుకున్నారు. ఆఖరికి చంద్రబాబు, లోకేష్‌తో పాటు వారి కుటుంబసభ్యులపైనా అత్యంత తీవ్రంగా వ్యక్తిగత దాడికి దిగారు. ఇలాంటి కొడాలిని ఓడించి ఆయనకు రాజకీయంగా కోలుకోలేని దెబ్బకొట్టాలని తెలుగుదేశం సర్వశక్తులూ ఒడ్డుతోంది. మరోవైపు గుడివాడలో నాని అనుచరుల అరాచకాలు మరీ శృతిమించిపోయాయి. నాని అండతో ఇసుక దోపిడీతో కోట్లు కొల్లగొట్టారు. మట్టి దందా యథేచ్ఛగా సాగింది. కనిపించిన భూమినంతా కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు, అధికారులను తమ చెప్పుచేతల్లో ఉంచుకుని అరాచకాలకు పాల్పడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు 90శాతం పూర్తైనా మిగిలిన 10శాతం నామమాత్రపు పనులు కూడా పూర్తి చేయలేదు. ఎన్నికలకు ముందు దీనిని తనకు అనుకూలంగా మలచుకునేందుకు అసలు లబ్ధిదారుల్ని మార్చేసి హడావుడిగా ముఖ్యమంత్రి చేత వాటిని ప్రారంభింపచేశారు. కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా కేవలం చంద్రబాబు పేరు లేకుండా చేసి తన పేరు చాటుకోవాలనే దురుద్దేశంతో ఇదంతా చేశారనే తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నారు.

గుడివాడలో ఈసారి కచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరేసి కొడాలి నానికి గట్టి బుద్ధి చెప్పాలనే పట్టుదలతో తెలుగుదేశం పార్టీ వెనిగండ్ల రామును ఎన్నికల బరిలో దింపింది. ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూస్తే ఎమ్మెల్యే కొడాలి నాని హవాకు ఈసారి ముగింపు పడబోతోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఏడాదికిపైగా రాము గుడివాడలో పాగా వేసి అన్ని వర్గాలతో మమేకమయ్యారు. తెలుగుదేశం సీనియర్‌ నేతలు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు, యలవర్తి శ్రీనివాసరావు సహా గుడివాడకు చెందిన మహామహులంతా ఏకతాటిపైకి వచ్చి రాము గెలుపు కోసం పనిచేస్తున్నారు. కొడాలి నాని అరాచకాలను విస్తృతంగా జనంలోనికి తీసుకెళుతుండడంతో వైఎస్సార్సీపీ నుంచి ఊహించని రీతిలో నిత్యం తెలుగుదేశంలోకి వలసలు పెరిగాయి. కీలక నాయకులంతా వైఎస్సార్సీపీని వీడి బయటకొస్తున్నారు. నందివాడ మండలంలో వైఎస్సార్సీపీ పట్టు తగ్గిందనే భావనా సర్వత్రా వ్యక్తమవుతోంది.


Tags:    

Similar News