కొత్త రికార్డులు సృష్టిస్తున్నపెట్రోల్ ధరలు

Update: 2020-01-07 14:14 GMT

దేశంలో పెట్రోల్ ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్ ధర 80 రూపాయలు దాటింది. ఏడాది వ్యవధిలో పెట్రోల్ రేట్ 80 రూపాయలు దాటడం ఇదే తొలిసారి. డీజిల్ ధర కూడా 75 రూపాయలకు చేరువైంది. గత నాలుగు రోజులుగా చమురు ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 80 రూపాయల 12 పైసలకు చేరింది. డీజిల్ ధర 74 రూపాయల 70 పైసల కు చేరింది.

అంతర్జాతీయంగా అనిశ్చితి వాతావరణం నెలకొంది. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దాంతో క్రూడాయిల్ ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఫలితంగా, దేశీయం చమురు రేట్లు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో పెట్రోల్ ధరలు మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం తొలగిపోతే గానీ చమురు రేట్లు తగ్గే అవకాశాలు లేవంటున్నారు.

Similar News