యూపీఐ లైట్ నుంచి త్వరలో కొత్త ఫీచర్ రాబోతుంది. ఈ ఫీచర్ ద్వారా వ్యాలెట్ లో తక్కువ బ్యాలెన్స్ ఉన్నా కూడా సులభంగా చెల్లింపులను చేసుకోవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూపీఐ లైట్ కోసం ఆటోమేటిక్ టాప్ అప్ ఫీచర్‌ను తీసుకువస్తోంది. ఇది చెల్లింపును మరింత సులభతరం చేస్తుంది. ఇది యూపీఐ లైట్ బ్యాలెన్స్ పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. ఆటో టాప్ అప్ ఫీచర్ ద్వారా బ్యాలెన్స్ పరిమితి తక్కువగా ఉన్నప్పుడు యూపీఐ లైట్ వాలెట్‌ని ఆటోమేటిక్‌గా టాప్ అప్ చేస్తుంది. యూపీఐ చెల్లింపులను మరింత సౌకర్యవంతంగా, మెరుగ్గా చేయడమే ఈ ఫీచర్ ముఖ్య ఉద్దేశం. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, భీమ్ వంటి అనేక ప్రసిద్ధ యూపీఐ అప్లికేషన్‌లు తమ కస్టమర్‌లకు యూపీఐ లైట్ సపోర్ట్‌ను అందిస్తున్నాయి. యూపీఐ లైట్ చిన్న చెల్లింపుల కోసం రూపొందించబడింది. అధిక చెల్లింపు పరిమితి రూ. 500 కాగా, సమాచారం ప్రకారం యూపీఐ లైట్ వాలెట్‌లో గరిష్టంగా రూ. 2,000 వరకు ఉంచుకోవచ్చు.