సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్. వరంగల్ రూరల్ జిల్లాలో సొంతగ్రామమైన ఐనపర్వతగిరి మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే ఆరురి రమేష్‌తోపాటు మంత్రి పర్యటించారు. గ్రామంలోని వీధులు తిరుగుతూ పారిశుద్ధ పనులను పరిశీలించారు. డ్రైనేజీ పనులు, ఇంకుడు గుంత నిర్మాణం, డంపింగ్ యార్డ్, స్మశానవాటిక పనుల పురోగతిపై ఆరాతీశారు. గ్రామంలో మిషన్ భగీరథ పనుల్లో నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుబయట చెత్తవేసిన వారిపై ఫైన్‌లు వేశారు.